Is it a Plant… or an Animal?

 



 మొక్కల్లోని అతి ముఖ్యమైన లక్షణాన్ని “దొంగిలించిన” జంతువు కథ ఇప్పుడు మీకు చెబుతున్నాను. 

ప్రకృతిలో అద్భుతాలకు కొదవ లేదు. అలాంటి అద్భుతమే ఇది.   అలాంటి వింత జీవుల్లో ఒకటి సముద్ర నత్త (Sea slug).  దీన్ని  ఎలీసియా క్లోరోటికా (Elysia chlorotica)అని పిలుస్తారు. ఈ నత్తని చూడగానే  మొక్కల్లో కనిపించే ప్రధాన లక్షణమైన ఫొటోసింథసిస్ (స్వయం పోషక గుణం) ఉన్నట్లు భ్రమలో పడిపోతాము.   అసలు గుట్టు బయటపడనంత వరకు ఈ నత్త ఫొటొసింథసిస్ (కిరణజన్య సంయోగక్రియ) చేసుకోగల “అద్భుత జీవి” అనిపిస్తుంది. ఈ మధ్యసోషల్ మీడియాలో “ఫొటోసింథసిస్ చేసుకోగలిగే జంతువు (ఇది మొక్కా? జంతువా?)” అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. 

  ఇప్పుడు నిజమేమిటో తెలుసుకుందాం. 

 ఈ సముద్ర నత్త ఆకారం చూస్తే చెట్టు ఆకులాగానే ఉంటుంది.  నీటిలో నెమ్మదిగా తేలుతూ ఉంటుంది.  దీంతో “మొక్క ఆకే” అని అనుకుంటారు.  కానీ ఇది నూటికి నూరు శాతం జంతువే. 

   ఈ జీవి సూర్య కాంతిని తీసుకుంటూ ఫొటోసింథసిస్ ప్రక్రియ ద్వారా స్వయంగా ఆహారం సృష్టించగలుగుతున్నదా? ఇటు మొక్కలకు అటు జంతువులకు “పరిణామక్రమ సంధానం” లా నిలిచిందా? ఈ సందేహాలు శాస్త్రవేత్తలకు కలిగి నిశితంగా పరిశోధనలు చేశారు. 

 వెల్లడైన నిజాలు: 

 * పూర్తిగా నిజం కాదు, అలా అని పూర్తిగా అబద్ధమూ కాదు. 

* అసలు రహస్యం — సాంకేతిక భాషలో చెప్పాలంటే: క్లెప్టోప్లాస్టీ (Kleptoplasty).

* ఈ సముద్ర నత్త చిన్న వయసులో  “ఆల్గీ “ (algae) అనే సూక్ష్మ మొక్కలను తింటుంది.

* ఐతే మిగతా జంతువుల్లా ఆల్గే ని పూర్తిగా జీర్ణించుకోలేదు. 

* ఆల్గీలో ఉన్న క్లోరోప్లాస్ట్‌లు (chloroplasts)లను అంటే  - మొక్కల్లో కాంతి సాయంతో ఆహారం తయారు చేసే భాగాలను) తన శరీర కణాల్లోకి తీసుకుంటుంది!

ఈ ప్రక్రియనే శాస్త్రవేత్తలు “క్లెప్టోప్లాస్టీ” అని అంటున్నారు.  మరో రకంగా చెప్పుకోవాలంటే “స్వయం పోషక యంత్రాంగాన్ని” దొంగతనం చేసేసిందన్న మాట. 

* ఈ కారణంగా ఈ  జంతువులో “స్వయం పోషక లక్షణం” వచ్చినట్లు అనిపిస్తుంది.  శరీరంలో జీర్ణం కాకుండా క్లోరోప్లాస్ట్ లు జంతు కణాల్లో ఉండటంతో ఇవి సూర్య కాంతిని గ్రహించి ఆహారం తయారు చేస్తంటాయి. దీంతో కొంత మేర శక్తి ఈ తరహా నత్తలకు లభిస్తున్నది. 

* దీని వల్ల ఈ జంతువు కొన్ని నెలల పాటు ఆహారం లేకుండానే బతక గలదు.

* అంత మాత్రాన ఇది  పూర్తిగా మొక్కలా జీవించదు. అలాగే స్వయంగా కిరణజన్య సంయోగ క్రియ చేసే శక్తి దీనికి లేదు. 

* అంటే ఫొటోసింథసిస్ చేయడం చేతకాకపోయినా “దొంగతనం” గా లాగేసుకున్న క్లోరోప్లాస్ట్ లతో ఫొటోసింథసిస్ చేయించుకుంటుందన్న మాట. 

* ఈ విషయం తెలియక చాలా మంది అపోహపడుతూ “ఫొటోసింథసిస్ చేసుకుంటున్న తొలి మొక్క” అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

* శాస్త్రవేత్తలు ఒక విషయంలో  మాత్రం ఆశ్చర్యపోయారు. సాధారణంగా క్లోరోప్లాస్ట్‌లు మొక్క కణాల నుంచి బయటకు వస్తే బతకలేవు. కానీ ఇక్కడ ఇవి జంతు కణాల్లో నెలల తరబడి యాక్టీవ్ గా పనిచేస్తున్నాయి. 



 ఈ జంతువు మనకు ఇచ్చే సందేశం: 

 1. ప్రకృతిలో గీతలు లేవు — మనమే గీసుకున్నాం. 

2. అవసరమే కొత్త మార్గాలను సృష్టిస్తుంది.


3. ప్రకృతిలో “అసాధ్యం” అన్న మాటకు స్థానం తక్కువ

4.  మార్పుకు అలవాటు పడగలిగినవాడే జీవనపోరాటంలో అంతిమ విజయం సాధించగలుగుతాడు. 



———-

Wonders in Nature

——

Is it a Plant… or an Animal?

———

Nature is full of wonders, and this is one such fascinating story. Today, we are talking about a strange animal that appears to have stolen one of the most important abilities of plants. In the nature, there is never a shortage of surprises. One such wonder is a sea slug, known scientifically as Elysia chlorotica. At first glance, this creature creates confusion. When we see it, we easily believe that it has the plant-like ability of photosynthesis—the process by which plants make their own food using sunlight.

  Until its secret was discovered, this sea slug looked like a truly “miraculous organism” capable of photosynthesis. Even today, social media posts often describe it as “an animal that can perform photosynthesis” and ask the question:

“Is it a plant or an animal?”

Let us now understand the real truth.

Leaf-like, but fully an Animal

The body of this sea slug looks exactly like a green leaf. It floats slowly in water, which makes many people think it is a plant leaf. However, the truth is very clear:

It is 100% an animal

Scientists were curious. Can this animal really make its own food using sunlight?

Is it a living bridge between plants and animals in evolution?To answer these questions, scientists studied it closely.

The Truth Revealed: 

The answer is interesting: 

It is not completely true, but not completely false either.

The real secret lies in a scientific process called Kleptoplasty. When this sea slug is young, it feeds on tiny plants called algae. But unlike other animals, it does not fully digest the algae. Instead, it takes the chloroplasts from the algae—the parts that help plants make food using sunlight—and stores them inside its own body cells.

Scientists call this process Kleptoplasty. In simple words, it means the sea slug has “stolen the food-making machinery of plants.”

Because of this, the chloroplasts inside the animal’s body continue to absorb sunlight and produce food. This gives the sea slug some energy and allows it to survive for several months without eating.

Not a Plant, Not a Photosynthesis Expert

However, this does not mean the sea slug has become a plant.

   •   It does not perform photosynthesis on its own

   •   It cannot live entirely like a plant

  •   It only uses the chloroplasts it has taken from algae


In other words, even though it cannot do photosynthesis by itself, it makes photosynthesis happen using the chloroplasts it has “borrowed.”

Because many people are unaware of this detail, some mistakenly describe it on social media as “the first animal that performs photosynthesis.” 

Why Scientists Are Amazed

One thing truly surprised scientists.Normally, chloroplasts cannot survive outside plant cells. But in this sea slug, they remain active inside animal cells for several months. This challenges our understanding of biology and shows how flexible and creative nature can be.


Nature’s Message to Us

This tiny animal gives us powerful lessons:

    1. Nature has no fixed boundaries — we create them.


2. Necessity creates new paths.


3. In nature, the word “impossible” has very little meaning.


4. Those who adapt to change are the ones who ultimately succeed in the struggle.

***********


Comments

Popular posts from this blog

The Oarfish and the Myth of Doomsday

Lemmings and the Myth of Mass Suicide

The Secret of the Crocodile’s Tail