Posts

Showing posts from January, 2026

Is it a Plant… or an Animal?

Image
   మొక్కల్లోని అతి ముఖ్యమైన లక్షణాన్ని “దొంగిలించిన” జంతువు కథ ఇప్పుడు మీకు చెబుతున్నాను.  ప్రకృతిలో అద్భుతాలకు కొదవ లేదు. అలాంటి అద్భుతమే ఇది.   అలాంటి వింత జీవుల్లో ఒకటి సముద్ర నత్త (Sea slug).  దీన్ని  ఎలీసియా క్లోరోటికా (Elysia chlorotica)అని పిలుస్తారు. ఈ నత్తని చూడగానే  మొక్కల్లో కనిపించే ప్రధాన లక్షణమైన ఫొటోసింథసిస్ (స్వయం పోషక గుణం) ఉన్నట్లు భ్రమలో పడిపోతాము.   అసలు గుట్టు బయటపడనంత వరకు ఈ నత్త ఫొటొసింథసిస్ (కిరణజన్య సంయోగక్రియ) చేసుకోగల “అద్భుత జీవి” అనిపిస్తుంది. ఈ మధ్యసోషల్ మీడియాలో “ఫొటోసింథసిస్ చేసుకోగలిగే జంతువు (ఇది మొక్కా? జంతువా?)” అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.    ఇప్పుడు నిజమేమిటో తెలుసుకుందాం.   ఈ సముద్ర నత్త ఆకారం చూస్తే చెట్టు ఆకులాగానే ఉంటుంది.  నీటిలో నెమ్మదిగా తేలుతూ ఉంటుంది.  దీంతో “మొక్క ఆకే” అని అనుకుంటారు.  కానీ ఇది నూటికి నూరు శాతం జంతువే.     ఈ జీవి సూర్య కాంతిని తీసుకుంటూ ఫొటోసింథసిస్ ప్రక్రియ ద్వారా స్వయంగా ఆహారం సృష్టించగలుగుతున్నదా? ఇటు మొక్కలకు అటు జంతువులకు “పరిణా...