Blood in Many Colours !




   మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది కదా అని అన్ని జీవుల్లో రక్తం ఎర్రగా ఉండదు.  రంగు రంగుల రక్తం గురించి చెప్పుకుందాం. ఈ అద్భుతాల లోకంలో ఆకుపచ్చ రంగు రక్తం, నీలం రంగు, ఊదా రంగు, పసుపు రంగు రక్తం ఉన్న జీవులు కూడా ఉన్నాయి. మన రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం, హీమోగ్లోబిన్. ఇందులో ఉన్న ఇనుము ఆక్సిజన్ తో కలసినప్పుడు ఎర్ర రంగు వస్తుంది. మరి కొన్ని జంతువుల్లో రక్తం ఆకుపచ్చగా, నీలంగా, ఊదా రంగుల్లో ఎందుకు ఉంటుంది ? ఆక్టోపస్, స్క్విడ్, పీతల్లో రక్తం నీలంగా ఉండటానికి కారణం వీటిలో హీమోగ్లోబిన్ కి బదులుగా హీమోసయానిన్ ఉంటుంది. ఇందులో కాపర్ ఉండటంతో ఆక్సిజన్ తో కలిసినప్పుడు నీలం రంగు వస్తుంది. సముద్ర జలాల్లో జీవించడం వల్ల తక్కువ ఆక్సిజన్ ఉండే పరిస్థితుల్లో హీమోసయానిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. 

 ఆకుపచ్చ రంగు రక్తం ఉన్న జీవులు న్యూగినియా లిజర్డ్స్ . ఆకుపచ్చ బల్లి జాతిలో రక్తమే కాదు దాని కండరాలు, ఎముకలు కూడా ఆకుపచ్చగానే ఉంటాయి. బిలివెర్డిన్ అనే కెమికల్ ఉండటంతో ఆకుపచ్చ రంగు రక్తం ఏర్పడింది. ఈ కెమికల్ మనిషికి విషపూరితం. ఈ బల్లులు మాత్రం విషాన్ని తట్టుకునేందుకు తగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 ఊదారంగు రక్తం కొన్ని రకాల సముద్ర పురుగుల్లో కనిపిస్తుంటుంది. ఒక్కో సారి ఊదా- పింక్ రంగులో కూడా రక్తం కనబడుతుంటుంది. హీమేరిత్రిన్ అనే పదార్థం ఆక్సిజన్ తో కలవడంతో  ఈ రంగు వస్తుంది. 

 కొన్ని కీటకాల్లో పసుపు రంగు లేదా పారదర్శికంగా రక్తం ఉంటుంది. వీటికి ఆక్సిజన్ ను తీసుకువెళ్ళే వ్యవస్థ వేరుగా ఉంటుంది. బొద్దింకలో తెల్లగా ఉండే ద్రవాన్ని రక్తం అనకుండా దాన్ని హీమోలింప్ అంటారు. తెలుపు- పసుపు మిశ్రమ రంగులో ఉంటుంది ఇది. 

 రక్తంలో ఇన్ని రంగులు రావడానికి ఆయా జీవులు జీవించే పరిసరాలే కారణం. 

  ఈ విశేష లక్షణం మనకు ఇస్తున్న సందేశం : మనకు నచ్చింది కదా అని అదే పద్ధతిని ఇతరులపై రుద్ద కూడదు. ఎవరి జీవన విధానం వారిది. ప్రకృతి అన్నింటినీ సమగా గౌరవిస్తుంది. విభిన్నతే జీవనానికి మూలం. పరిణామక్రమానికి ఇదే మూల సూత్రం. 

———- english ——


Blood in Many Colours !


We all know that human blood is red. But does that mean all living creatures have red blood? 

 Not at all.

  In the fascinating world of nature, there are animals with blue blood, green blood, purple blood, yellow blood — and even colourless blood.

  This colourful diversity is one more reminder that nature never follows just one rule.

  Human blood is red because of a substance called hemoglobin.

  Hemoglobin contains iron, and when iron combines with oxygen, it gives blood its familiar red colour.

 But in many animals, oxygen is carried in different ways — and that changes the colour of their blood.

  Animals like octopus, squid, and crabs have blue blood. Instead of hemoglobin, their blood contains hemocyanin, a copper-based oxygen-carrying substance.

  When copper binds with oxygen, the blood turns blue. This system works especially well in cold, low-oxygen seawater, making hemocyanin ideal for marine life.

 Some rare New Guinea green-blooded lizards have truly astonishing bodies.

  Not only their blood, but even their muscles and bones appear green. This colour comes from a chemical called biliverdin.

 In humans, biliverdin is toxic. But these lizards have evolved the ability to tolerate it safely. Scientists believe this unusual trait may protect them from parasites like malaria.

  Certain marine worms have blood that appears purple or purple-pink. This is due to a substance called hemerythrin, another oxygen-binding pigment. When it combines with oxygen, the blood takes on a purplish colour.

  In many insects, blood is yellowish or transparent.

  In fact, it is not called blood at all — it is known as hemolymph.

  For example, in cockroaches, the pale yellow fluid circulating inside the body does not carry oxygen.

  Insects breathe through a tracheal system, which delivers air directly to their tissues.

So their circulating fluid does not need to be red.

  The reason behind these different blood colours lies in the environment.

•   Life in oceans

•   Low oxygen conditions

•   Heat, cold, or parasites


Each species has evolved a system best suited to its surroundings.

Nature designs different solutions for different lives.


   This colourful variety teaches us an important lesson:

 •   What works for one may not work for another.

 •   Every living being has its own way of life.

  •   Nature favors survival, offering equal opportunity but unequal outcomes

  We should not force our choices or methods on others simply because we think they are right.

  Diversity is the foundation of life. This principle of diversity is also the core of evolution itself.

*********


Comments

Popular posts from this blog

The Oarfish and the Myth of Doomsday

Lemmings and the Myth of Mass Suicide

The Secret of the Crocodile’s Tail