The Plant That Blooms Once – A Life of Patience
* పుష్పించడానికి దశాబ్దాల ఎదురుచూపు.
* సహనం, ఓర్పుకు ప్రతీక.
* మొక్క ఇస్తున్న మౌన సందేశం.
****
జీవితకాలంలో ఒక్క సారి మాత్రమే పుష్పించి ఆ తర్వాత కొద్దికాలానికే కృశించి నశించే మొక్క కథ ఇది!
ఒక ప్రక్క అగ్నిపర్వతాలు వెదజల్లే వేడి బూడిద ఆపైన అల్ట్రావైలెట్ కిరణాల తాకిడి, మరో వైపున రాత్రి పూట వీచే బలమైన చలిగాలులు తరచు నీటి ఎద్దడి … ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా దశాబ్దాల పాటు ఒంటరిగా జీవించే మొక్క ఇది.
ఈ మొక్క పేరు Haleakala SilverSward . వృక్షశాస్త్రం ప్రకారంగా చూస్తే ఇది Asteraceae కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్ర నామం : Argyroxiphium sandwicense (subsp. macrocephalum).
అమెరికాకి నైరుతీ దిశగా ఉన్న Maui, Hawaii దీవి లోని Haleakala అగ్నిపర్వత శిఖరాల్లో ఈ మొక్కలు తరచు కనబడతుంటాయి. ఏడు వేల అడుగుల ఎత్తులో ప్రతికూల పరిస్థితుల్లో బతకడానికి అలవాటు పడిన మొక్కలివి. మరెక్కడా సహజసిద్ధంగా పెరగవు. దీని ఆకులపై వెండి రంగులో మెరిసే నూగు ఉంటుంది.
Haleakala ప్రాంతం ఆశ్చర్యకరమైన సూర్యోదయాన్ని తిలకించే చోటు కూడా. అందుకే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది ఈ ప్రాంతం.
సరే, ఈ మొక్క ఉనికిని అది పుష్పించడానికి ముందు దాకా
ఎవరూ ఎక్కువగా పట్టించుకోరు . ఎత్తు కూడా తక్కువే, కానీ దాని నుంచి ఉన్నట్లుండి పొడుచుకు వచ్చే ఆరడుగుల పొడవాటి కాడపై వందలాది ఊదా రంగు పువ్వులు రాగానే పర్యాటకులను ఈ మొక్క ఇట్టే ఆకర్షిస్తుంటుంది. ఐతే, ఈ మొక్క ఇలా పుష్పించడం కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తుంటుందని చాలా మందికి తెలియదు. పైగా ఈ మొక్క తన జీవితకాలంలో ఒక్క సారి మాత్రమే పుష్పిస్తుంది. ఈ ఘడియ కోసం ఒక్కో సారి ఐదు దశాబ్దాల పాటు ఓపిగ్గా ఎదురు చూడగలదు.
పునరుత్పత్తి (రిప్రొడక్షన్) దీని జీవితానికి సాఫల్యత చేకూర్చే కీలక ఘట్టం. పుష్పించడంతో తన పుట్టుకకు పరమార్థం సిద్ధించిందని భావించగానే అది కొద్ది రోజుల్లోనే నశిస్తుంది. ఏ జీవికైనా తన జీవితంలో ప్రధానమైనది తనను పోలిన జీవులను ప్రత్యత్పత్తి కావించడమేనన్న సత్యానికి ఈ అరుదైన మొక్క ప్రతీకగా నిలుస్తున్నది.
అంతే కాదు మంచి కాలం వచ్చే వరకు ఎంతో ఓపికతో ఒక్కోసారిదశాబ్దాల తరబడి నిరీక్షించాలన్న ఓ చక్కని సందేశాన్ని ఈ మొక్క మౌనంగా మనకు అందజేస్తున్నది.
మనలో కొంత మంది ఊరికే నిరాశ పడుతుంటారు. ఓపిక తక్కువ. నిరీక్షణ అసలే పడదు. దీంతో అనుకున్న పని కాకపోతే డిప్రెషన్ కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ మొక్క కథ చెప్పాలి. వారిలో కనువిప్పు కలిగించాలి. అందుకే కొంతమంది కవులు ఈ మొక్క ప్రత్యేకతను చాటిచెబుతూ కవితలల్లారు. వీరిలో స్థానిక కవి, రచయిత జూలియట్ ఎస్. కొనో ఒకరు. ఈయన “Silverswords” పేరిట వ్రాసిన కవిత Haleakala ప్రాంతలో తరచు వినబడుతుంటుంది. ప్రేరణ కలిగిస్తుంటుంది.
****
——





Comments
Post a Comment